12-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకుగాను వేసిన 11 నామినేషన్లలో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్, బీఆర్‌ఎస్ అభ్యర్థి దాసోజ్ శ్రవణ్, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం నామినేషన్లు ఆమోదం పొందాయని ఎన్నికల ప్రధాన అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నామినేషన్ల విత్‌డ్రాకు ఈ నెల 13వ తేదీ గడువు ఉంది. 20వ తేదీన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఐదు స్థానాలకు ఐదుగురు సభ్యుల నామినేషన్లు ఆమోదం పొందడం వల్ల ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. తిరస్కరణకు గురైన నామినేషన్లలో.. కంటే సాయన్న, చంద్రశేఖర్, జాజుల భాస్కర్, భోజరాజు, బోగ తిలక్, సిలివేరు శ్రీకాంత్ ఉన్నారు.