calender_icon.png 16 January, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 రోజుల్లో 591 సెల్‌ఫోన్ల రికవరీ

06-09-2024 01:17:21 AM

బాధితులకు అప్పగించిన రాచకొండ పోలీసులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాచకొండ కమిషనరేట్ పరిధిలో 25 రోజుల్లో 591 సెల్‌ఫోన్లను రికవరీ చేశామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. రాచకొండ ఐటీ సెల్ కో సీసీఎస్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) సహాయంతో మొత్తం 591 సెల్‌ఫోన్లను రికవరీ చేశామని, ఇందులో ఎల్బీనగర్ సీసీఎస్ పరిధిలో 339 ఫోన్లు, భువనగిరి సీసీఎస్ పరిధిలో 103 ఫోన్లు, మల్కాజిగిరి సీసీఎస్ పరిధిలో 149 సెల్‌ఫోన్లను రికవరీ చేశామన్నారు. వీటితో కలిపి ఈ సంవత్సరం ఇప్పటివరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 3,213 సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్లు సుధీర్‌బాబు చెప్పారు. 

కాగా మొబైల్ ఫోన్లు పోయినప్పుడు, దొంగతనానికి గురైనప్పుడు వెంటనే మొబై ల్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. ఆ నంబర్ ఆధారంగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన, చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేస్తామని సీసీ తెలిపారు. రికవరీ చేసిన సెల్‌ఫోన్లను గురువారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో వాటి యజమానులకు సీపీ అప్పగించారు.