- గురు, శుక్ర వారాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
- పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరిన్ని భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురు, శుక్ర వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్‌లను జారీచేసింది. ఇందులో ఎక్కువగా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని జిల్లాలే ఉన్నాయి. దీనితోపాటు రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షా లు కురిసే అవకాశం ఉండటంతో చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేయడం గమనార్హం.
దీనితోపాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయ ని, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రాబోయే ఐదు రోజు ల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు.. ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు ఇలా ఉన్నాయి. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉన్నదని, ఆరెం జ్ అలెర్ట్ జారీచేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ భారీవర్షాలు కురిసే అవకా శం ఉన్నదని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.