యూపీలో ఘటన
కన్నౌజ్, నవంబర్ 27: ఉత్తరప్రదేశలోని కన్నౌజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మెడికోలు( వైద్య విద్యార్థులు) అక్కడికక్కడే మృతి చెందారు. మరో పీజీ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. సైఫాయి మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న విద్యార్థులు లక్నోలోని ఓ పెండ్లికి హాజరయ్యారు. అనంతరం సైఫాయికి తిరిగి వస్తుండగా మంగళ వారం అర్ధరాత్రి కన్నౌజ్ వద్ద ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
అనంతరం అటువైపు వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంవల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతిచెందిన వారిలో అనిరుధ్ వర్మ, సంతో ష్ కమార్ మౌర్య, అరుణ్‌కుమార్, నార్దేవ్‌తో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు.
గాయపడిన మరో డాక్టర్‌ను మురాదాబాద్‌లోని బుద్ధవిహార్‌కు చెందిన డాక్టర్ జైవీర్ సింగ్‌గా గుర్తించారు. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మార్చురీలో భద్రపరి చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.