calender_icon.png 1 March, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో ఐదుగురు మావోయిస్టులు

01-03-2025 12:44:50 AM

జన జీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తాం జిల్లా ఎస్పీ సింధు శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 28 (విజయ క్రాంతి), పోరుబాట పట్టకండి... ఆయుధాలు వదలండి.... అజ్ఞాతాన్ని వీడండి... జన జీవన స్రవంతిలో కలవండి.. పోరు వద్దు... కుటుంబ సభ్యులే ముద్దు... అంటూ కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కు చెందిన ఐదుగురు మావోయిస్టులు అజ్ఞాతంలో పనిచేస్తున్నారని వెల్లడించారు.

ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్రావు అలియాస్ పడకాల స్వామి అలియాస్ ప్రభాకర్, మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఎర్ర గొల్ల రవి అలియాస్ దినేష్, ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకేటి రమేష్, లోకేటి లావణ్య అలియాస్ శాంతి, అడ్లూరు ఎల్లారెడ్డి కి చెందిన లింబయ్య గారి వెంకట్ రెడ్డి లు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు.

వీరు కూడా జనజీవ స్రవంతిలోకి రావాలని ఆమె కోరారు. వీరు జనజీవన స్రవంతిలోకి వస్తే ప్రభుత్వ ప్రతిఫలాలు, పునరావాసం, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి  పాల్గొన్నారు.