22-02-2025 04:55:24 PM
జల్నా: మహారాష్ట్ర జల్నాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. నిర్మాణ స్థలంలో తాత్కాలిక షెడ్డుపై టిప్పర్ ట్రక్కు ఇసుకను దించుతున్న సమయంలో ఐదుగురు కార్మికులు మరణించారని, వారిలో ఒక మైనర్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. జాఫ్రాబాద్ తహసీల్‌లోని పసోడి-చందోల్ వద్ద వంతెన ప్రాజెక్టు స్థలంలో తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని ఒక అధికారి తెలిపారు.
ఇసుకతో నిండిన టిప్పర్ విశ్రాంతి తీసుకుంటున్న కూలీలపై ట్రక్కు డ్రైవర్ ఇసుకను కుమ్మరిచారు. నిద్రిస్తున్న కూలీలను గమనించకుండా ట్రక్కు డ్రైవర్ ఇసుక అన్ లోడ్ చేశాడు. ఇసుక అన్ లోడ్ చేసినప్పుడు షెడ్డు కూలడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందారు.ట్రక్కు డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. శిథిలాల నుంచి ఒక బాలిక, ఒక మహిళను సహాయక సిబ్బంది రక్షించినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మృతులను సిల్లోడ్ తహసీల్‌లోని గోలెగావ్ నివాసితులు గణేష్ ధన్వాయ్ (60), అతని కుమారుడు భూషణ్ ధన్వాయ్ (16), జాఫ్రాబాద్ తహసీల్‌లోని పద్మావతి నివాసి సునీల్ సప్కల్ (20) గా గుర్తించారు. మిగిలిన ఇద్దరు బాధితుల గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదని ఆయన అన్నారు.