లక్నో,(విజయక్రాంతి): ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్ పత్ లో మతపరమైన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లడ్డూలను సమర్పించే క్రమంలో చెక్క నిర్మాణంలో ఉన్న వాచ్ టవర్ కుప్పకూలింది. ఈ ప్రమదంలో ఐదుగురు మృతి చెందగా.. జైన శిష్యులు, పోలీసు సిబ్బందితో సహా 60 మంది పైగా భక్తులు గాయపడ్డారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వేంటనే స్పందించిన అధికారులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటన స్థలంలో సహయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. యూపీలోని బాగ్ పత్లో ఉన్న ఆదినాథుడి నిర్వాణ లడ్డూ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. లడ్డూ కోసం భక్తులు పోటీపడగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది.