calender_icon.png 22 February, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు కేసుల్లో ఐదు కేజీల గంజాయి పట్టివేత..

17-02-2025 11:37:00 PM

8 మంది పై కేసు నమోదు ఆరుగురు అరెస్ట్..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): చార్మినార్ ప్రాంతంలోని దరూల్ షరీఫ్ ప్రాంతంలో గంజాయి విక్రయం జరుగుతోందనే సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఏ టీం ఎక్సైజ్ పోలీసులు సోమవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. అక్కడ గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.6 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టిఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. ఈ కేసులో నలుగురిపై కేసు నమోదు కాగా సదన్ ఖాన్, షేక్ సజ్జన్‌లీ, అజీజ్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఒరిస్సా కు చెందిన ఓ వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. 

సనత్ నగర్ ప్రాంతంలోని జెపి నగర్ బి.కె గూడలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఎస్టిఎఫ్ సి టీం తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని, రెండు మొబైల్ ఒక టూ వీలర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టిఎఫ్ సిఐ నాగరాజు, ఎస్సు జ్యోతి తెలిపారు. ఈ కేసులో వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన మామిడి స్వర్ణ రాజు కుమార్, వెంకట రామకృష్ణ, బాలు అలియాస్ విని లను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.