calender_icon.png 20 January, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంగరలో ఐదుకిలోల గంజాయి స్వాధీనం

01-09-2024 01:04:46 AM

ఇద్దరు నిందితుల అరెస్ట్

ఇబ్రహీంపట్నం, ఆగస్టు, 31 (విజయక్రాంతి): గంజాయిని విక్రయి స్తున్న ఇద్దరు నిందితులను ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన బిశ్వజిత్ మధు (31), సంతోష్ సర్కార్ (78) కొంగరకలాన్‌లో ఉన్న ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈజీ మనీ కోసం గంజాయి విక్రేతలుగా మారిన వీరిద్దరు.. స్థానికంగా గంజాయి విక్రయించడం మెదలు పెట్టారు.  శనివారం వారు గంజాయి అమ్ముతు న్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను కొంగరకలాన్ సమీపంలోని కల్వకోల్ ఫంక్షన్‌హాల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా వీరిద్దరిపై కేసులు ఉన్నట్లు విచారణలో తేలిందని ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.