03-03-2025 12:48:31 AM
జెండా ఊపి ఎంఆర్ 4త్ ఎడిషన్ 5కె రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ
శేరిలింగంపల్లి, మార్చి 2 (విజయక్రాంతి):మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ కాలనీలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఆర్ 4త్ ఎడిషన్ 5కె రన్ కార్యక్రమానికి మాజీ భారత అంతర్జాతీయ క్రికెటర్ మాజీ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్ ఎస్ కే. ప్రసాద్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ. అనంతరం రన్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ... మాతృ శ్రీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ వారి ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించడం చాలా అభినందనియం అని,నేటి ఉరుకు పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరంఅని, దానికి ఈ రన్ ఎంతగానో ఉపయోగపడుతుం దని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. వృద్ధులు ,యువత , చిన్న పిల్లలు పాల్గొనడం ఎంతో మంచిదని ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శారీరక శ్రమ వలన మానసిక ఉల్లాసం ,ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. ఈ రన్ లో దాదాపు 1500 మంది వరకు ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాతృ శ్రీ నగర్ కాలనీ వాసులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.