18-03-2025 01:06:09 AM
హైదరాబాద్, మార్చి17(విజయ క్రాంతి): వృద్ధి, ఉపాధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లైఫ్ సెన్సైస్ రంగాల్లో పర్యాటకాన్ని తెలంగాణకు ప్రధాన చోదకంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీ-2025-2030ని ప్రకటించి ంది. పలు ఏజెన్సీలతో చేయించిన అధ్యయనం ఆధారంగా వచ్చిన ఇన్‌పుట్‌లను జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో టూరిజం విధానాల్లో అత్యుత్తమ విధానాలను క్రోడీకరించి ఈ పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఐదు సంవత్సరాల ప్రణాళిక, ఐదు లక్ష్యాలు, ఐదు వ్యూహాలతో విధానాన్ని ప్రకటిస్తూ సోమవారం జీవోను విడుదల చేసింది. ఈ పాలసీ ఐదేళ్ల పాటు అమల్లో ఉండనుంది. జీవో వచ్చిన క్షణం నుంచి పాలసీ అమలవుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొం ది
. పర్యాటక రంగానికి గణనీయమైన కొత్త పెట్టుబడులను సాధించ డం, అదనపు ఉపాధి అవకాశాలను సృష్టించడం, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలలో తెలంగాణను టాప్-5 రాష్ట్రాల్లో ఉండమే లక్ష్యంగా సర్కారు ఈ పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్ర జీడీపీలో టూరిజం 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండేలా ఈ పాలసీ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
2500 సంవత్సరాలకు పైగా అద్భుతమైన చరిత్రను కలిగిన తెలంగాణ.. చారిత్రక కోటలు, స్మారక చిహ్నాలు, దేవాలయాలు, సరస్సులు, రాతి ప్రాంతాలు, వన్యప్రాణులు, వృక్షజాలం, జంతుజాలం, పండుగలు, కళలు, సంస్కృతితో అనేక పర్యాటక ప్రదేశాలకు నిలయం.
వ్యూహాత్మక రాయితీలు, ప్రోత్సాహకాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహకాన్ని అందించడానికి, తద్వారా కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, బ్రాండింగ్ వ్యూహాంతో ప్రపంచ అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానాల్లో తెలంగాణను ఒకటిగా నిలబట్టడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం.
టూరిజం పాలసీ ఐదు లక్ష్యాలు..
* రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగానికి రూ.15,000కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడం.
* 5 సంవత్సరాల్లో మూడు లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాన్ని సృష్టించడం.
* దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకల్లో తెలంగాణను టాప్- 5 రాష్ట్రాల్లో నిలపడం.
* డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా ద్వారా తెలంగాణ పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తూ.. టూరిస్టులను ఆకర్షించడం
* తెలంగాణ జీడీపీలో టూరిజం వాటాను 10శాతం లేదా అంతకంటే ఎక్కువకు పెంచడం
ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ బోర్టులు
పర్యాటకలను విభిన్న కోణాల్లో ఆకర్షించేందుకు ఐదు వ్యూహాలను ప్రభుత్వం ప్రతిపా దించింది. ఇందులో అనుభవపూర్వక పర్యాటకం, సంస్కృతి, సంప్రదాయాలు, వంటలు లాంటి అంశాల్లో స్థానికంగా విభిన్న ఉండే వాటితో పర్యాటకులను ఆకర్షించాలని పర్యాటకాన్ని ఐదు విధాలుగా విభజించింది.
కింద పేర్కొన్న ఎకో టూరిజం, మెడికల్, వెల్నెస్ టూరిజం అంశాల్లో సంబంధిత మంత్రులతో ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీ బోర్టును ప్రభు త్వం ఏర్పాటు చేయనంది. ఈ బోర్డుల్లో సం బంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఎండీలు, ఇతర ఉన్నతాధికారులు ఉండనున్నారు.
27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలు గుర్తింపు
రాష్ర్టవ్యాప్తంగా ప్రత్యేక పర్యాటక ప్రాంతాల(ఎస్‌టీఏ)ను మిషన్ మోడ్‌లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా 27 ప్రత్యేక ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో మాస్టర్ ప్లానింగ్ విధానం ద్వారా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది.
పర్యాటక ప్రదేశాల్లో పోలీసు యూనిట్లు/గస్తీలను ఏర్పాటు చేయడం, మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవడం, ఈ మేరకు టీఎఫ్‌ఐ సూచనలు పాటించడం, అలాగే, అన్ని పర్యాటక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండేలా ఐకానిక్ ప్రాజెక్టులను నిర్మించాలన్న యోచనలో సర్కారు ఉంది.
భూమి లభ్యత ఆధారంగా పీపీపీ మోడ్‌లో ఓఆర్‌ఆర్ ఎగ్జిట్‌పాయింట్ల వద్ద మెగా టిటైల్ మాల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, గోదావరి, కృష్ణ నది పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వాటర్ స్పోర్ట్స్, హౌస్-బోట్‌లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కేరళ బోట్ తరహాలో రివర్ ఫెస్టివల్స్‌ను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పాలసీలో పేర్కొంది.
హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేయడం, ప్రత్యేక పర్యాటక ప్రాంతాలలో విస్తృతంగా ఎయిర్ కనెక్టివిటీ పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే, గోల్ఫ్ టూరిజాన్ని అభివృద్ధి చేయనుంది. వారసత్వ భవనాలు, కోటలు, రాజభవనాలు, సమాధులు వంటి స్మారక చిహ్నాలను కార్పోరేట్ సంస్థలు స్వీకరించి టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఐదు కేటగిరీలుగా టూరిజం ప్రాజెక్టులు
ఈ పాలసీ పరిధిలోకి వచ్చిన ప్రాజెక్టులకు రాయితీలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ పాలసీ పరిధిలోకి రావాలంటే కింద అర్హతలు ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. కేటగిరీల వారీగా ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రకటించింది.
క్యాటగిరీ అర్హతలు
ఐకానిక్ ప్రాజెక్టులు - రూ.500కోట్లకు పైగా పెట్టుబడి
లేదా 2000 మందికి ప్రత్యేక్ష ఉపాధి
మెగా ప్రాజెక్టులు - రూ.100 కోట్ల నుంచి 500 కోట్ల లోపు పెట్టుబడులు
లేదా 500 మంది నుంచి 2000 మందిలోపు ఉపాధి
భారీ ప్రాజెక్టులు - రూ.50 కోట్ల నుంచి 100 కోట్లు పెట్టబడులు
మీడియం ప్రాజెక్టులు - రూ.10కోట్ల నుంచి 50కోట్ల పెట్టుబడులు
చిన్న, సూక్ష్మ తరహా ప్రాజెక్టులు - రూ.10కోట్ల పెట్టుబడుల వరకు