calender_icon.png 2 April, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదుగురు జూదరుల అరెస్ట్

31-03-2025 10:14:35 AM

ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): పేకాట వస్తావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురి జూదరులను అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్(Adibatla Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండల పరిధి( Ibrahimpatnam mandal) కొంగరకలాన్ గ్రామ శివారులో ఉన్న జామ తోటలో గుట్టుచప్పుడు కాకుండా కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిభట్ల పోలీసు దాడి చేసి పట్టుకున్నారు. జూదరుల వద్ద నుండి 5 మొబైల్ ఫోన్లు, 3 వాహనాలతో పాటు రూ. 60,230 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.