calender_icon.png 23 November, 2024 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదుగురు నకిలీ విలేకరుల అరెస్టు

22-07-2024 03:07:20 AM

వివరాలు వెల్లడించిన సీఐ కరుణాకర్

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 21 (విజయక్రాంతి):  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులమని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురు నకిలీ విలేకర్లను అరెస్టు చేసినట్లు కొత్తగూడెం వన్‌టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీన దాసరి కార్తీక్‌కు శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి రిపోర్ట్ అని చెప్పి మీ తల్లి వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే మీ నాన్న ఆమెను చంపాడని, ఈవిషయం పత్రికల్లో రాకుండా ఉండాలంటే మేము అడిగిన డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు.

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విచారణ జరపగా శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు నకిలీ విలేకర్లని, డబ్బుల కోసం బెదిరిస్తుంటారని తేలిందన్నారు. అరెస్టు చేసిన వారిలో ఏలూరి రాజేష్, శ్రీనగర్‌కాలనీ, లక్ష్మిదేవిపల్లి మండలం బర్లిఫీట్‌కు చెందిన దాసరి సాంబశింవరావు, చుంచుపల్లి మండలం హౌసింగ్‌బోర్డుకు చెందిన గుంటూరు శ్రీనివాసరావు, రుద్రంపూర్‌కు చెందిన మిలీనియం క్వార్టర్ నివాసి మేకల రమేష్, మేదర్‌బస్తీకి చెందిన బాదావత్ గణేష్ ఉన్నారని తెలిపారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు.