20.8కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తి
న్యూఢిల్లీ, నవంబర్ 20: డిజిటైజేషన్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద మొత్తంలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆధార్ ధ్రువీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్‌ల ద్వారా 5.8కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగిపోయాయని తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తం 80.6కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నట్టు వివరించింది. ఇప్పటి వరకు 20.4కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ ప్రక్రియ పూర్తునట్లు వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా 5.33 లక్షల చౌకధరల దుకాణాల్లో ఈపోస్ యంత్రాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. వీటి సాయంతో 99.8శాతం కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసినట్టు చెప్పింది. దీంతో 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తుందని పేర్కొంది. అంతేకాకుండా ఆహార పదార్థాల సరఫరా విషయంలో ఎఫ్‌సీఐ ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపింది. సరకు రవాణాను పర్యవేక్షించేందుకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను రైల్వేతో అనుసంధానించినట్టు వివరించింది.