calender_icon.png 16 January, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదుగురు బైక్ దొంగల అరెస్ట్

06-09-2024 01:09:31 AM

  1. రెండు బైక్‌లు, రూ.85వేల నగదు రికవరీ 
  2. ఏసీపీ రమేష్‌బాబు వెల్లడి

ముషీరాబాద్, సెస్టెంబర్ 5: జల్సాలకు అలవాటు పడి బైక్‌లను దొంగిలించి వాటి స్పేర్ పార్టులను విడదీసి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు దొంగలు, ముగ్గురు స్క్రాప్ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రాంబాబు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను వెల్లడించారు... ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్‌కు చెందిన ఖాజా హుస్సేన్ స్క్రాప్ దుకాణం నడుపుతున్నాడు. ఇతడు యూసఫ్ పాషాతో కలిసి ఇటీవల మోర్ సూపర్ మార్కెట్ వద్ద పార్కింగ్ చేసిన 5 బైక్‌లను దొంగిలించాడు.

అందులో రెండు బైక్‌లను పార్టు పార్టులగా విడదీసి స్పేర్ పార్టులుగా విక్రయించాడు. మరో మూడు బైక్‌లను సద్దామ్ హుస్సేన్, గులాం దస్తగిరి, మహ్మద్ రహ్మాన్ అనే ముగ్గురికి అమ్మేశారు. బైక్ దొంగతనాలపై అందిన ఫిర్యాదుల మేరకు ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు, క్రైం టీమ్ చలపతిరెడ్డి, నదీమ్, సిబ్బందితో కలిసి సీసీ ఫుటేజీ సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు.. వారినుంచి రూ.85 వేలు రికవరీ చేశారు. అలాగే వారివద్ద లభించిన రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ రమేష్ బాబు తెలిపారు.