కామారెడ్డి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేటలో లింగ నిర్ధారణ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డిలో శుక్రవారం ఎస్పీ సిం ధూశర్మ వివరాలు వెల్లడించారు. రాజంపేట మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారనే సమాచారం మేరకు సీసీఎస్ పోలీస్, రాజంపేట పోలీసులు శుక్రవారం అతడి ఇంటిలో సో దాలు నిర్వహించారు.
సిద్దిపేట గ్రామానికి చెందిన మహిళలకు లింగ నిర్ధారణ చేస్తుండగా పట్టుకున్నారు. బల్ల రవీందర్ గతంలో రాజంపేట్‌లోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, కామారెడ్డి కౌసల్య ఆసుపత్రిలో స్కానింగ్ విభాగంలో పనిచేసేవాడు. 2021 లో కౌస ల్య ఆసుపత్రి సీజ్ కావడంతో ఎలాగైనా డ బ్బులు సంపాదించాలని, ఆన్‌లైన్‌లో అల్ట్రా సౌండ్ స్కానర్ గురించి తెలుసుకున్నాడు.
కౌసల్య ఆసుపత్రి వారిని సంప్రదించి అల్ట్రా సౌండ్ స్కానర్‌ను రూ.2 లక్షలకు కొన్నాడు. బల్ల రవీందర్ తన ఇంటి వద్దే ఉంచి తనకు తెలిసిన వారికి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. మిషన్ కొనుగోలుకు సహకరించిన, అమ్మిన వ్యక్తులు సంసాన్, చింతల దుర్గపూ డి, బోయిని యాదగిరి, బక్కి ప్రవీణ్‌కుమార్‌లపై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ లింగ నిర్ధారణ పరీక్షకు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు సైతం సహకరిస్తున్నట్లు తెలుస్తున్నది.