19-02-2025 12:14:28 AM
445 గ్రాముల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడించిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్
కామారెడ్డి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు మంగళవారం కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవుని పల్లి పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పట్టుకోవడమే కాకుండా వారి వద్ద నుంచి 445 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి రూరల్ సీఐ రామన్ తెలిపారు.
గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నం బైపాస్ రోడ్డు 44వ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేపట్టగా ఐదుగురు పట్టుబడ్డట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసే రిమాండ్ కి తరలించినట్లు సిఐ రామన్ తెలిపారు. వారి వద్ద నుంచి కారు, రెండు మోటార్ సైకిల్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో దేవుని పల్లి ఎస్‌ఐ రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.