calender_icon.png 15 January, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్

08-07-2024 12:12:39 PM

మంథని,(విజయక్రాంతి): గంజాయి తరలిస్తున్న పట్టుబడిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి మంథని కోర్టులో హాజరు పరచినట్లు మంథని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం రామగిరి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... లద్నాపూర్ ఓసిపి-II సెంటర్ వద్ద కొండవేన అనీల్ రామగిరి మండలం తన స్నేహితులతో కలిసి కొండపాక రవికిరణ్, వజినేపల్లి, జాడి రమేష్, స్థంభంపల్లి (మహాముత్తారం మండలం) సుతారి శ్రీకాంత్, ధన్వాడ, (కాటారం మండలం) ఐదుగురు మూడు కిలోల గంజాయి, విలువ రూ. 75000 వేల గల గంజాయిని రెండు మోటార్ సైకిల్స్ పై రామగిరి మండలపరిధిలోని నాగేపెల్లి ఎక్స్ రోడ్ వైపు అమ్మడానికి తీసుకొని వస్తుండగా ఆదివారం లద్నాపూర్ ఓసీపీ- 2 సెంటర్ వద్ద రామగిరి ఎస్ఐ సందీప్ వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వెంటనే వీరి దగ్గర ఉన్న 3 కిలోల గంజాయిని, 2 మోటార్ సైకిల్స్ ( పల్సర్, హోండా షైన్ )ని మొబైల్ ఫోన్లను పంచుల సమక్షంలో  ఎస్ఐ సీజ్ చేసివారిపై కేసు నమోదు చేశారు. తర్వాత వీరందరినీ మంథని సిఐ  వెంకటేశ్వర్లు అరెస్టు చేసి రిమాండ్ కొరకు మంథని కోర్టులో హాజరు పర్చారు.  

జల్సా లకు డబ్బు లు సరిపోకపోవడంతో

జల్సా లకు డబ్బు లు సరిపోకపోవడంతో ఎలాగైనా తొందరగా సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో  వీరు ఇదివరకే గంజాయి తాగే అలవాటు ఉండటం వలన గంజాయి అమ్మడం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో అవసరాలు తీర్చుకోవచ్చని ఒడిస్సా రాష్ట్రానికి చెందిన కాంతారావు అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి చుట్టుపక్కల గ్రామాలలో రహస్యంగా గంజాయి తాగుడుకు అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ డబ్బులకు అమ్ముతున్నారని, ఎవరైనా గంజాయి అమ్మడం కానీ తాగడం కానీ అనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.