రాజేంద్రనగర్, జూలై 10: గంజా యి విక్రయిస్తున్న ఐదుగురిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేసి అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముషక్‌మహల్ పాత భవనం వద్ద కొందరు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు బుధవారం ఉదయం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఐదుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వా ధీనం చేసుకున్నారు. అదే విధంగా 5 సెల్‌ఫోన్లను పట్టుకున్నా రు. నిందితులపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.