హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బాగ్‌బహరా రైల్వే స్టేషన్‌లో ట్రయల్ రన్ జరుగుతున్న దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన ఐదుగురిని అరెస్టు చేశారు. రైలు ట్రయల్ రన్ సమయంలో మహాసముంద్‌లోని బాగ్‌బహారా సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ దాడిలో మూడు కోచ్‌లు దెబ్బతిన్నాయి. రైలు సిబ్బంది వెంటనే ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాగ్‌బహారాకు చెందిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బగ్‌బహారా నివాసితులు. నిందితులు-శివ్ కుమార్ బఘెల్, దేవేంద్ర చంద్రకర్, జీతు తాండి, లఖ్‌రాజ్ సోన్వానీ, అర్జున్ యాదవ్‌లను శనివారం రాయ్‌పూర్ రైల్వే కోర్టులో హాజరుపరిచారు. 1989 రైల్వే చట్టం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.