calender_icon.png 23 January, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిని హత్య చేసిన కేసులో ఐదుగురు అరెస్ట్, రిమాండ్..

22-01-2025 10:28:10 PM

కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడి...

కామారెడ్డి (విజయక్రాంతి): భూ తగాదాల్లో సొంత అన్నదమ్ములతో పాటు మరికొందరు కలిసి పథకం ప్రకారం వ్యక్తిని హత్య చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారంలో ఈనెల 19న ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం రాగా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి రవి అనే వ్యక్తినీ హత్య చేశారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాల ద్వారా కేసును దర్యాప్తు చేయగా హత్య చేసిన అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి కిష్టయ్య పొక్కిలి కిషన్ షేక్ ఆఫీస్ చాకలి రాకేష్ పొక్కిలి సత్యవ్వలు పథకం ప్రకారం రవిని హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని ఏఎస్పీ తెలిపారు.

వారిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఒక సుత్తి ఒక కర్రతో పాటు వారి వద్ద ఉన్న రెండు మోటార్ సైకిల్లు ఒక గొలుసు ఐదు ఫోన్లు 15 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరు పరిచినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడించారు. ఈ కేసును చేదించిన వారిలో కామారెడ్డి రూరల్ సిఐ రామన్ రామారెడ్డి, ఎస్ఐ నరేష్, ఏఎస్ఐ రవీందర్, క్రైమ్ టీం సిబ్బంది రవికిరణ్, సాయిలు, రాజు, రమేష్ లను జిల్లా ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్య రెడ్డి అభినందించారు.