calender_icon.png 23 December, 2024 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు తీసిన చేపలవేట

22-12-2024 12:58:18 AM

కాలువలో మునిగి మామ, అల్లుడు మృతి

గజ్వేల్, డిసెంబర్21: సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్‌లో చేపలవేటకు వెళ్లి మామ, అల్లుడు మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గొడుగు శివకుమార్(30) కుకునూర్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. శుక్రవా రం రాయపోల్ మం డలం ఎల్కంటి గ్రామానికి చెందిన కిష్టయ్య తన అల్లుడు గొడుగు శివకుమార్ ఇంటికి వచ్చాడు. కుకునూర్‌పల్లి సమీపంలోని తిప్పారం ప్రాంతంలోని మల్లన్నసాగర్ కాలువలో చేపలు పట్టడానికి శుక్రవారం సాయంత్రం మామ, అల్లుడు కలిసి వెళ్లారు. శనివారం తెల్లవారినా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వారి కోసం గాలించారు. మల్లన్నసాగర్ కాలువ కట్టపై ఇద్దరి బట్టలతో పాటు బైక్ కూడా ఉండటంతో అనుమానంతో గజ ఈతగాళ్ల సహాయంతో కాలువలో వెతికించ గా.. శివకుమార్, కిష్టయ్య మృతదేహాలు లభించాయి. కుకునూర్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.