calender_icon.png 22 November, 2024 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి

22-11-2024 03:37:55 AM

సూర్యాపేట , నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని  ముదిరాజ్ సంఘం  సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఈదుల యాదగిరి ముదిరాజ్ డిమాండ్ చేశారు. ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన జిల్లాకేంద్రంలోని రెండో వార్డు  కోమటికుంటలో  మత్స్యకారులతో కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన నియోజకవర్గంలోని 15 గ్రామాల్లో  పర్యటించారు.

ఈ సందర్భంగా యాదిగిరి మాట్లాడుతూ.. మత్స్యకారులు ఐక్యంగా  ఉండి, సమస్యల పరిష్కారమయ్యేంతవరకు పని చేస్తామన్నారు. సరాకర ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ చేర్చాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్య కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలన్నారు. మత్స్య కార్మికుల్లో నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయని, ఆ కుటుంబాలను గుర్తించి ఇందిరమ్మ గృహాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పిట్టల మహేందర్, పిట్టల శశిధర్, లింగయ్య, వెంకట్ రాములు, ఈదులూరి ఉపేందర్, అంతటి మల్లయ్య, జీడయ్య పాల్గొన్నారు.