calender_icon.png 26 December, 2024 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేప పెంపకంతో మత్సకారులకు లబ్ధి

08-11-2024 05:58:55 PM

మానకొండూర్ (విజయక్రాంతి): మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్రం ప్రభుత్వం చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లల పెంపకం చేపడుతోందని కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ లో  శుక్రవారం జిల్లా మత్స్య శాఖ అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. మత్సకారుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా ఉచితంగా చేప పిల్లల పంపిణి చేపట్టిందన్నారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ లోకి 80 నుంచి 100 మిల్లీ మీటర్ల పొడవు గల చేప పిల్లలను వదిలినట్టు తెలిపారు. గంగపుత్రులు, ముదిరాజులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా  మత్సకారుల కుటుంబాలు లబ్ధిపొందాలని కోరారు.

మత్స్య రంగంపై ఆధారపడి ఉన్నవారికి అందుబాటులో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్, మండల పార్టీ అధ్యక్షుడు బి.రాఘవరెడ్డి, పార్టీ నాయకులు గుడిసె అయిలయ్య యాదవ్, పాశం రాజేందర్ రెడ్డి, పసుల వెంకటి, ఎలగందుల ప్రసాద్, రజనీకాంత్, అంతగిరి, గోపాల్, కరుణాకర్ రెడ్డి, జమాల్, నరేశ్ తో పాటు మత్స్యశాఖ అధికారులు,మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.