calender_icon.png 1 March, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వలలో చిక్కి మత్స్య కార్మికుడు మృతి

28-02-2025 09:16:52 PM

నిర్మల్ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండల కేంద్రానికి చెందిన మత్స్య కార్మికుడు భోజన్న(59) చేపల వలలో చిక్కుకొని మృతి చెందినట్లు దిల్వార్పూర్ పోలీసులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టడానికి వల వేస్తుండగా వాళ్ళ చిక్కుకోవడంతో నీటిలో పడి మృతి చెందినట్లు తోటి కార్మికులు తెలిపారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.