calender_icon.png 4 January, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల వేటకు వెళ్లి జాలరి మృతి..

01-01-2025 11:13:23 PM

చేపల వల కాళ్లకు చుట్టుకొని మృతి చెందిన జాలరి...

కామారెడ్డి (విజయక్రాంతి): చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై శివకుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన బెస్తసాయిలు(36) మహమ్మద్‌నగర్ మండలం కొమలాంచ గ్రామ శివారులోని మంజీరనదిలో చేపలు పట్టేందుకు మంగళవారం వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం వెళ్లి చూడగా చేపల వల కాళ్లకు చుట్టుకొని మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య విడాకులు కొరుతూ భర్తకు ధూరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవ పంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.