26-04-2025 06:43:08 PM
సిరిసిల్ల (విజయక్రాంతి): సిరిసిల్ల మత్స్యశాఖ-రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో చేపలు పట్టు లైసెన్సు దారులకు అవగాహన సదస్సు రుద్రవరం అరెండర్ కాలనీలో కమిటీ హాల్ లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమములో మధ్యమానేరు జలాశయ పరిధిలో గల లైసెన్స్ దారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా, ఈ క్రింది అంశములను అమలు పర్చుటకై నిర్ణయించడమైనది, పలు సూచనలు చేయడం జరిగినది.
లైసెన్స్ దారులు విధిగా ప్రతి సంవత్సరము సెప్టెంబర్ మొదటి రోజు నుండి రెన్యువల్ లేదా నూతన లైసెన్స్ లను తగు సంబదిత ఋజువులు జతపరచి, లైసెన్స్ రుసుము మత్స్యశాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా నందు చెల్లించి లైసెన్స్ పొందవలసినదిగా లేదా లైసెన్స్ రెన్యువల్ చేసుకోవలసినదిగా నిర్ణయించడమైనది. మధ్య మానేరు జలాశయంలో చేపలు పట్టుకునే లైసెన్స్ దారులకు, తెప్పలు వలలను సబ్సిడీపై ఇప్పించగలరని జిల్లా మత్స్య శాఖ అధికారిని కోరడం జరిగింది. అలాగే చేపలు వేట నిషేధ కాలం అనగా జూలై, ఆగష్టు మాసములలో మధ్య మానేరు జలాశయం పరిధిలోని గ్రామాల మత్స్యకారులు / లైసెన్స్ దారులు చేపలు పట్టకూడదని తెలియచేయడమైనది.
ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ దారులుగాని మరెవరైనా చేపలు పట్టినచో పై చట్టరీత్య అమలులో ఉన్న నియమ నిబంధనల ప్రకారం చర్యలు, తీసుకోనబడతాయని తెలియచేయడమైనది. మధ్య మానేరు జలాశయంలో నీటి నిల్వలు పదిల వరకు మాత్రమే ఉన్నప్పుడు అందులో కేవలం భూములు కోల్పోయిన నిర్వాసిత లైసెన్స్ దారులకు మాత్రమే చేపలు పట్టుకొనుటకుగాను లైసెన్స్ దారులు జిల్లా మత్స్యశాఖ అధికారి, రాజన్న సిరిసిల్ల కోరడమైనది. ఈ అవగాహన సదస్సులో యం. సౌజన్య., జిల్లా మత్స్యశాఖ అధికారి, రాజన్న సిరిసిల్ల, చొప్పరి రామ చంద్రం, అధ్యక్షులు, జిల్లా మత్స్య పారిశ్రామిక సహాకార సంఘం, రాజన్న సిరిసిల్ల జిల్లా డైరెక్టర్ లు, లైసెన్స్ దారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.