బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని దుగ్నేపల్లి గ్రామంలో గల బోకె చెరువులు శనివారం అర్ధరాత్రి దొంగలు పడి మూడు క్వింటాళ్ళకు పైగా చేపలను పట్టుకుని అమ్ముకున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నెన్నల మండల కేంద్రానికి చెందిన చేపలు పట్టే వ్యక్తులకు డబ్బులు ఇచ్చి రాత్రంతా బోకే చెరువులో చేపలు పట్టించారు. దొంగతనంగా పట్టిన చేపలను బెల్లంపల్లికి తరలించారు.
చేపలు పట్టుకుపోతున్న వ్యక్తులను గమనించిన గ్రామస్తులు, మాజీ సర్పంచ్ డోలె సురేష్ తో కలిసి చేపలతో పారిపోతున్న భీమేష్, రాపల్ అనే ఇద్దరు వ్యక్తులను వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా డబ్బులు ఇచ్చి చేపలు పట్టాలని చెప్పడంతో తాము చెరువులో చేపలు పట్టి అప్పగించినట్లు అంగీకరించారు. పట్టుబడ్డ వ్యక్తులపై తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ సర్పంచ్ డోర్ల సురేష్ తెలిపారు.