calender_icon.png 13 January, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడాలి

09-12-2024 12:00:00 AM

* కేంద్రానికి సీఐఐ సూచన

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ప్రస్తుత 2024 25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించిన జీడీపీలో 4.9 శాతం, 2025 4.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికి  కేంద్ర ప్రభు త్వం కట్టుబడి ఉండాలని పరిశ్రమల సమా ఖ్య సీఐఐ విజ్ఞప్తి చేసింది. నిర్దేశిత లక్ష్యాన్ని మించి ద్రవ్యలోటు పెరిగితే భారత ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించింది. వచ్చే బడ్జెట్‌కు తాము ఇచ్చిన సూచనల్ని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వివరిస్తూ ద్రవ్యలోటు అదుపునకు కేంద్ర ప్రభుత్వ రుణాల్ని 2030 జీడీపీలో 50 శాతం దిగువకు తగ్గించుకునేలా, దీర్ఘకాలంలో 40 శాతం దిగువకు తెచ్చేలా రోడ్‌మ్యాప్‌ను బడ్జెట్లో ప్రకటించాని కోరామన్నారు.

ప్రభుత్వ రుణాలు తగ్గితే భారత సార్వభౌమ రేటింగ్‌పై సానుకూల ప్రభావం పడుతుందని, ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు తగ్గుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వివరించింది. 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలు నేరుగా మార్కెట్ నుంచి రుణాలు సమీకరించేందుకు అనుమతించాలని తమ బడ్జెట్ ముందస్తు వినతిపత్రంలో కేంద్రానికి సూచించినట్లు బెనర్జీ తెలిపారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణను పాటించడాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రాలకు స్వతంత్ర, పారదర్శక క్రెడిట్ రేటింగ్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సీఐఐ కోరింది. ఈ రేటింగ్ వ్యవస్థ ఆధారంగానే రాష్ట్రాలకు కేంద్రం వివిధ పథకాలకు, మూలధన వ్యయానికి నిధులు బదిలీ చేయవచ్చని పరిశ్రమల సమాఖ్య సూచించింది.