calender_icon.png 23 January, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4.9 శాతానికి తగ్గిన ద్రవ్య లోటు లక్ష్యం

24-07-2024 01:17:53 AM

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్రవ్య లోటు లక్ష్యాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  జీడీపీలో 4.9 శాతానికి తగ్గించాలని టార్గెట్‌గా నిర్ణయించారు.  గత ఫిబ్రవరి 1న సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో నిర్ణయించిన 5.1 శాతం లక్ష్యానికన్నా ఇది తక్కువగా ఉండడం గమనార్హం. ప్రభుత్వ రాబడి, ఖర్చుకు మధ్య ఉన్న అంతరాన్ని ద్రవ్య లోటుగా పేర్కొంటారు. ఈ లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం రుణాల సేకరణ చేయాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం మొదట ద్రవ్య లోటు టార్గెట్‌ను 5.9 శాతంగా పెట్టుకుంది. అయితే ఆ ర్వాత దాన్ని  5.8 శాతానికి సవరించింది.

అంతేకాకుండా 202526 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్య లోటును 4.5 శాతం దిగువకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మధ్యంతర బడ్జెట్‌లో ఈ లక్ష్యాన్ని 5.1 శాతంగా నిర్ణయించగా ఇప్పుడు దాన్ని 4.9 శాతానికి తగ్గించడానికి ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)నుంచి డివిడెండ్ రూపంలో భారీ మొత్తం అందడంతో పాటుగా పన్ను వసూళ్లు సైతం లక్ష్యాన్ని మించడమేనని నిపుణులు అంటున్నారు. 202627నుంచి ప్రభుత్వం అప్పు తగ్గుతూ ఉండేలా చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని కూడా ఆర్థిక మంత్రి చెప్పారు.