calender_icon.png 27 October, 2024 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్, మే నెలల్లో ద్రవ్యలోటు వార్షిక అంచనాల్లో 3 శాతమే

29-06-2024 12:39:41 AM

  • సీజీఏ డేటా

ముంబై, జూన్ 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు పరిమితంగా ఉన్నది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరం మే చివరినాటికి వార్షిక బడ్జెట్ అంచనాల్లో 3 శాతమే నమోదైనట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 2023 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో 11.8 శాతం ద్రవ్యలోటు  ఏప్రిల్, మే నెలల్లో నమోదయ్యింది.

ప్రభుత్వ ఆదాయ, వ్యయాల్లో వ్యత్యాసమైన ద్రవ్యలోటు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.16,85,494 కోట్లుగా (జీడీపీలో 5.1 శాతం) ఈ ఏడాది ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో కేంద్రం అంచనా వేసింది. ఇందులో రూ.50,615 కోట్లు (బడ్జెట్ అంచనాల్లో 3 శాతం) ద్రవ్యలోటు 2024 ఏప్రిల్, మే నెలల్లో నమోదయ్యిందని సీజీఏ డేటా వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో నికర పన్నుల ఆదాయం రూ.3.19 లక్షల కోట్లుకాగా, (బడ్జెట్ అంచనాల్లో 12.3 శాతం) మొత్తం వ్యయం రూ.6.23 లక్షల కోట్లుగా (బడ్జెట్  అంచనాల్లో 13.1 శాతం) ఉన్నది.