calender_icon.png 8 January, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళింగ లాన్సర్స్‌కు తొలి విజయం

07-01-2025 11:51:16 PM

హాకీ ఇండియా లీగ్

భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో వేదాంత కళింగ లాన్సర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. మంగళవారం రూర్కెలాలోని బిర్సా ముండా హాకీ స్టేడియం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్ 6 బెంగాల్ టైగర్స్‌ను చిత్తుగా ఓడించింది. కళింగ తరఫున బ్రింక్‌మన్ (ఆట 3వ, 47వ నిమిషంలో) డబుల్ గోల్స్‌తో మెరవగా.. సంజయ్ (6వ ని.లో), అలెగ్జాండర్ హెండ్రిక్స్ (9వ ని.లో), నికోలస్ (29వ ని.లో), బాబీ సింగ్ (49వ ని.లో) గోల్స్ సాధించారు. ఈ విజయంతో కళింగ లాన్సర్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకగా.. మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ బెంగాల్ టైగర్స్ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పట్టికలో నంబర్‌వన్ స్థానంలోనే ఉంది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో టీమ్ గొనాసికాతో తమిళనాడు డ్రాగోనా, యూపీ రుద్రాస్‌తో హైదరాబాద్ తుఫాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.