20-04-2025 12:52:46 AM
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయ క్రాం ): సింగరేణి ఇతర రాష్ట్రాల విస్తరణలో తొలి అడుగుగా ఒడిశా రాష్ర్టంలో నైనీ బొగ్గు గని ని విజయవంతంగా ప్రారంభించామని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశా ల్లో మరిన్ని గనులు, ఇతర ఖనిజ ఉత్పత్తుల ను కూడా చేపట్టేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
నైనీ బొగ్గు బ్లాకును ప్రారంభించిన సందర్భంగా శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో అధికారులు, ఉద్యోగు లు, కార్మిక సంఘాల నాయకులు బలరాం అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. నైనీ బొగ్గు గని ప్రారంభంతో సింగరేణి ఎక్కడైనా విస్తరించగలదన్న నమ్మకం ఏర్పడిందన్నారు.
నైనీ బొగ్గు బ్లాకు సాధన వెనుక సీఎం, డిప్యూటీ సీఎం చొరవతో పాటు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, ఒడిశా సీఎం, వివిధ శాఖల అధికారుల సహకారం ఉందన్నారు.
సింగరేణి సంస్థ ఇకపై ఖనిజాల ఉత్ప త్తి సంస్థగా కూడా ఎదగనున్నదని, థర్మల్ విద్యుత్తుతో పాటు, పునరుత్పాదక విద్యుత్తు రంగంలో కూడా విస్తరించనున్నదని తెలిపారు. సమావేశంలో ప్రాతినిధ్య కార్మిక సం ఘం సెక్రటరీ జనరల్, రాష్ర్ట కనీస వేతనాల కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌డీఎం సుభాని పాల్గొన్నారు.