calender_icon.png 23 January, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘తెలుసు కదా’ ఫస్ట్ సాంగ్ షూట్

13-08-2024 12:00:00 AM

సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధిశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టిజి విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా పరిచయమౌతున్నారు. హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నారు.

తాజాగా సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై ఓ పాటను చిత్రీకరణ ప్రారంభించారు. థమన్ సంగీతం అందిస్తున్న ఓ చార్ట్‌బస్టర్ సాంగ్‌కు కెకె లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ పాడారు. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాకు సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ, ఎడిటర్‌గా నవీన్ నూలి. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నారు. హీరో సిద్దు జొన్నలగడ్డ తన పాత్ర కోసం స్టైలిష్ మేకోవర్ అయ్యారు.