- ట్రంప్, కమలకు చెరో మూడు ఓట్లు
- ఇద్దరి మధ్య తీవ్ర పోటీ
వాషింగ్టన్, నవంబర్ 5: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం ప్రారంభమైన కొద్దిసేపటికే తొలి ఫలితం వచ్చింది. ఇద్దరు అభ్యర్థులకు చెరో మూడు ఓట్లు వచ్చాయి. అమెరికా, కెనడా బార్డర్‌లో ఉన్న న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్ అనే చిన్న కౌంటీలో ఆరుగురు ఓటర్లు ఉన్నారు.
వీరిలో నలుగురు రిపబ్లికన్ పార్టీ తరఫున ఓటర్లుగా నమోదు చేసుకోగా, మరో ఇద్దరు మాత్రం ఏ పార్టీ తరఫున నమోదు చేసుకోలేదు. ఎలక్షన్ డే రోజున పోలింగ్ కేంద్రంలో వీరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 15 నిమిషాల తరువాత అక్కడ ఫలితాలను అధికారులు ప్రకటించారు.