calender_icon.png 20 January, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతకం గెలిచిన తొలి శరణార్థి

05-08-2024 12:05:00 AM

విల్లెపింటే (ఫ్రాన్స్): ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో కామెరునియన్ బాక్సర్ సిండీ గంబా చరిత్ర సృష్టించింది. ఈ ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి శరణార్థి అథ్లెట్‌గా సిండీ రికార్డులకెక్కింది. మహిళల మిడిల్‌వెయిట్ క్వార్టర్ ఫైనల్స్‌లో గంబా ఫ్రెంచ్ బాక్సర్ డేవియా మిచెల్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకుంది. ఈ క్రమంలో కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా సిండీ ఖాతాలో కాంస్యం వచ్చి చేరుతుంది. ఇక ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచి వచ్చిన గంబా 11 ఏళ్ల వయసులో లండన్‌కు వలస వచ్చింది. అయితే 2021లో సిండీ ‘గే’ అని ముద్రపడడంతో కామెరున్ జైళ్లో కొన్నాళ్ల పాటు ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ఈసారి ఒలింపిక్స్‌లో 37 మందితో కూడిన శరణార్థుల బృందం పాల్గొనగా.. సిండీ గంబా పతాకధారిగా వ్యవహరించడం గమనార్హం.