calender_icon.png 20 March, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిజ్ఞాస ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో ప్రధమ బహుమతి

19-03-2025 11:27:09 PM

కామారెడ్డి (విజయక్రాంతి): హైదరాబాదులో ప్రదర్శించిన జిజ్ఞాస ప్రాజెక్టులో 'తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి ఉచిత బస్ పథకం- ప్రాముఖ్యత' అనే అంశంపై అర్థశాస్త్రంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి కైవసం చేసుకోవడం అభినందనీయమైనదని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ... 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని మహా పురుషులవుతారని..... సాధన, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని గ్రామీణ స్థాయి విద్యార్థులు సైతం రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానంలో నిలవటం కళాశాలకు గర్వకారణమని తెలిపారు. 

ఫిజిక్స్, రాజనీతి శాస్త్రం, హిందీ సబ్జెక్టులు రాష్ట్రస్థాయిలో పోటీపడి ఉత్తమ ప్రదర్శన ఇవ్వటం సంతోషకర విషయం అని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే. కిష్టయ్య మాట్లాడుతూ... ప్రణాళిక బద్ధంగా పనిచేసినప్పుడు ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని, రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవటమే ఇందుకు నిదర్శమని విద్యార్థులు పరిశోధనలు వైపు అడుగులు వేయాలని సూచించారు. 

ఈ సందర్భంగా ప్రాజెక్టుకు రూపకల్పనగా వ్యవహరించిన డాక్టర్. రాజ్ గంభీరావు, విద్యార్థులు కే. రచన, కావేరి, వందన, షేక్ ముస్కాన్, భవిత, అక్షరలను అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిజ్ఞాస కోఆర్డినేటర్ డాక్టర్.దినకర్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ అంకం జయప్రకాష్, అర్థశాస్త్ర విభాగధిపతులు  డాక్టర్ ఏ. సుధాకర్, డాక్టర్ గణేష్, ఆచార్యులు డాక్టర్ జి శ్రీనివాసరావు, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, శ్రీవల్లి, మానస అధ్యాపకులు ఫర్హీన్ ఫాతిమా, రాంప్రసాద్, శ్రీలత, అనిల్, ఏ. శ్రీలత తదితరులు పాల్గొన్నారు.