calender_icon.png 25 February, 2025 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి

18-02-2025 04:39:53 PM

ఎమ్మెల్సీ దండే విఠల్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యావేత్త కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ దండే విఠల్ పిలుపునిచ్చారు. మంగళవారం పెంచికల్ పేట్ మండలం చేడ్వాయి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న జరిగే పట్టబద్రుల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ప్రణాళికబద్ధంగా చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సముద్రాల సరిత రాజన్న, మాజీ సర్పంచ్ సుజాత శ్రీనివాస్, చంద్రమౌళి, నాయకులు సదశివ్, కృష్ణ, శంకర్ గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.