calender_icon.png 11 January, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో సహకార సంఘం ద్వారా 3.69లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరణ

11-01-2025 12:11:57 PM

పెద్దపల్లి జిల్లాలోనే అత్యధికంగా వరి ధాన్యం కొనుగోలు చేసిన మంథని సహకార సంఘం

రూ.82.39 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ

సన్న రకాలకు క్వింటాల్ కు అదనంగా రూ.500 బోనస్ జమ

కేంద్రాల నిర్వహణకు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, రైతులకు, అధికారులకు కృతజ్ఞతలు

మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని (విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని పరిధిలోని (34) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ ఖరీఫ్ 24-25 సీజన్ లో 5237 మంది రైతుల నుంచి 3 లక్షల69 వేల 839.20 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు జరిపి పెద్దపల్లి జిల్లాలోనే ప్రథమ స్థానం లో నిలిచిందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్  తెలిపారు. శనివారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఖరీఫ్ 24-25సీజన్ లో మంథని ఏఎంసి, గుంజపడుగు, పవర్ హౌస్ కాలనీ, పుట్టపాక, నాగారం, విలోచవరం, ఎక్లాస్ పూర్, ఖానాపూర్, గోపాల్ పూర్, నాగెపల్లి, వెంకటాపూర్, లక్కేపూర్, మహాబూబ్ పల్లి, శ్రీరాంనగర్, గుమ్నూరు, అక్కెపల్లి, మల్లెపల్లి, పోతారం, ఆరెంద, అడవిసోమన్ పల్లి, గంగాపురి, గద్దలపల్లి, చిన్న ఓదాల, బిట్టుపల్లి, గాజులపల్లి, కాకర్లపల్లి, సిరిపురం, నగరంపల్లి, మల్లారం, ఆంగ్లూరు, సూరయ్యపల్లి, కన్నాల, స్వర్ణపల్లి, ఖాన్ సాయిపేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సహకార సంఘం ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లు జరిపినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు 4983 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.82 కోట్ల 39 లక్షల 90 వేల 656 జమ అయ్యాయని, మిగతా 254మంది రైతుల చెల్లింపులు రూ.3 కోట్ల 35లక్షల 41వేల 8 వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. అంతేగాకుండా సన్న రకాలు విక్రయించిన రైతులకు క్వింటాళ్ కు రూ.500 రైతుల బ్యాంక్ ఖాతాల్లో అదనంగా జమ అవుతున్నాయని తెలిపారు. వరి ధాన్యం కేంద్రాల నిర్వహణ సజావుగా సాగేందుకు అన్ని రకాల సహకరించిన ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా సహకార శాఖ అధికారి, పౌర సరఫరాల శాఖ డిఎం, డిఎస్ ఓ, వ్యవసాయ శాఖ అధికారి, సహకార శాఖ మానిటరింగ్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు, రైస్ మిల్లర్లు, హమాలీలు, సంఘ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.