నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మహిళా ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న డి జ్యోతి రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలో ప్రథమ స్థానాన్ని దక్కించుకొని పదివేల నగదు పురస్కారాన్ని శుక్రవారం అందుకున్నారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించగా డీ జ్యోతి రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటుకున్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎస్సైకి 15000 నగదు చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యూసుఫ్ అలీ రాజీవ్ రమణ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.