17-04-2025 12:14:17 AM
కరీంనగర్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ నిర్వహించిన ఒలంపియాడ్ లో కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. పాఠశాలకు చెందినటువంటి పి. శ్లోక ఇంగ్లీష్ ఒలంపియాడ్లో స్టేట్ 1వ ర్యాంక్, యం.డి అబ్దుల్ అర్హాన్ జనరల్ నాలెడ్జ్ ఒలంపియాడ్లో స్టేట్ 4వ ర్యాంక్, జి. సాయి సంహిత్ మ్యాథ్స్ ఒలంపియాడ్లో స్టేట్ 4వ ర్యాంకు, యం. శివేన్ రెడ్డి మ్యాథ్స్ ఒలంపియాడ్ లో స్టేట్ 4వ ర్యాంకు, డి. స్నిగ్దాశ్రీ మ్యాథ్స్ ఒలంపియాడ్ స్టేట్ 1వ ర్యాంకు, ఎ. వాన్మయి, మ్యాథ్స్ ఒలంపియాడ్లో స్టేట్ 5వ, కె. సాన్వి సైన్స్ ఒలంపియాడ్లో స్టేట్ 5వ ర్యాంకుతో టాపర్స్ గా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.