01-03-2025 06:54:47 PM
చేర్యాల (విజయక్రాంతి): బోధనోపకరణాల మేళాను అట్టహాసంగా శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా చేర్యాల పెద్దమ్మగడ్డ జడ్ పిహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన టీఎల్‌ఎం మేళాలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల టీఎల్‌ఎం మేళాను సిద్దిపేట డీఈఓ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. 32 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సైన్స్, గణిత, ఇంగ్లిష్, ఎన్విరాన్‌మెంట్ సైన్స్ పై రూపొందించిన పలు అంశాలకు చెందిన ప్రయోగాలను, పాఠ్యాంశాల అంశాలను ప్రదర్శించారు.
గణితంలో ఆకునూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్ స్టాప్ మొదటి బహుమతి సాధించగా వారికి సిద్దిపేట డీఈఓ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రంతో పాటు జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఎంఈఓ రచ్చ కిష్టయ్య, ఆకునూరు కాంప్లెక్స్ హెచ్ఎం ఎం. అయిలయ్య, ఆకునూరు ఎంపీపీఎస్ హెచ్ఎం మెడిచేల్మి అయోధ్య, ఉపాధ్యాయులు నాగిల్ల శ్యామ్ సుందర్ రెడ్డి, రాధాబాయ్, ప్రేమ్ కుమార్, సమ్మయ్య, నరేష్, రాజయ్య, సరోజినిదేవి, భవాని, తదితరులు పాల్గొన్నారు.