calender_icon.png 21 September, 2024 | 5:36 AM

కశ్మీర్‌లో నేడు తొలి విడత పోలింగ్

18-09-2024 04:27:53 AM

  1. ఏడు జిల్లాల్లో 24 నియోజకవర్గాలకు ఎన్నికలు 
  2. దాదాపు దశాబ్దం తర్వాత ఓటేస్తున్న ప్రజలు

శ్రీనగర్, సెప్టెంబర్ 17: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం తొలివిడుత పోలిగ్ జరుగనున్నది. 7 పిర్‌పంజాల్ పర్వత శ్రేణుల ప్రాంతంలో జిల్లాల్లో విస్తరించి ఉన్న 24 అసెంబ్లీ స్థానాలకు తొలి విడుతలో పోలింగ్ జరుగనున్నది. అన్ని పార్టీలతోపాటు స్వతం త్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 90 మంది స్వతంత్రులు ఉండటం విశేషం. 23 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జమ్ము రీజి యన్‌లో 8, కశ్మీర్ లోయలో 16 నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరుగనున్నది.

ఈ స్థానాలకు దాదాపు దశాబ్దం తర్వాత ఎన్నికలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ స్థానాల పరిధిలో 23,27,580 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది స్త్రీలు, 60 మంది థర్డ్ జెండర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. త్రాల్, పుల్వామా, రాజ్‌పారా, జైనపోరా, షోపియన్, డీహెచ్ పోరా, కుల్గామ్, దేవ్‌సర్, దూరు, కోకెర్‌నాగ్ (ఎస్టీ), అనంత్‌నాగ్ వెస్ట్, అనంత్‌నాగ్, శ్రీగుఫ్‌వారా షంగూస్ ఈస్ట్, పహల్గావ్, ఇందె ర్వాల్, కిష్తార్, పద్దర్ భదర్వాహ్, దోడా, దోడా వెస్ట్, రామ్‌బర్, బనీహాల్ నియోజకవర్గాలకు తొలి విడుతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కశ్మీర్ లో ఇటీవల ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో పోలింగ్‌కు అంతరాయం కలుగ కుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.