అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇకపై నర్సరీ తరగతులు
దేశంలోనే మొట్ట మొదటిసారిగా చిన్నారులకు యూనిఫాం
శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): చిన్నారులకు తొలి ఒడి అమ్మ మలి ఒడి కావాలని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా ‘అమ్మ మాట- అంగన్ వాడీ బాట’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం అన్ని జిల్లాల సంక్షేమ శాఖ అధికారు లు, చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారులతో అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళల భద్ర త, చిన్నారుల దత్తత, చైల్డ్ కేర్ వంటి అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.
ఇక నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు నర్సరీ తరగతులు బోధిస్తారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి లబ్ధి దారులకు నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకె ట్లు పంపిణీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు నాసిరకం సరుకులు సరఫరా చేస్తే, అంగన్‌వాడీ టీచర్లు వాటిని తిరస్కరించాలని సూచించారు. ‘పిల్లల భద్ర త మా బాధ్యత’ అనే నమ్మకాన్ని తల్లిదండ్రులకు కలిగించాలన్నారు. దేశంలోనే మొట్టమొ దటి సారిగా అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫాం అందించనున్నామన్నారు. పిల్ల లు లేని దంపతుల కోసం పిల్లల దత్తత ప్రక్రియను సుల భతరం చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఇకపై చాటుమాటుగా దత్తత తీసుకుని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా దంపతులు పిల్లలను దత్తత తీసుకోవచ్చన్నా రు. మహిళలు, చిన్నారులపై దాడులు అఘాయిత్యాలు జరిగితే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం మంత్రి యునెస్కో సౌజన్యం తో రూపొందించిన న్యూట్రీషియన్ చాంపియన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశం లో మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ పాల్గొన్నారు.