calender_icon.png 22 December, 2024 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంక్‌గా మారిన తొలి ఎన్‌బీఎఫ్‌సీ

22-12-2024 12:09:27 AM

కోటక్ మహీంద్రా బ్యాంక్

దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత రిజర్వ్ బ్యాంక్ నుంచి లైసె న్సు లు పొందిన బ్యాంక్‌లు కొత్త టెక్నాలజీతో, అత్యాధునిక బ్యాంకింగ్ సేవలతో కా ర్యకలాపాలు ప్రారంభించినవి నవతరం బ్యాం క్‌లుగా ప్రసిద్ధి పొందాయి. ఈ నవతరం బ్యాంకుల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ పదేండ్లు ఆలస్యంగా బ్యాంకింగ్ రంగంలోకి  అడుగుపెట్టింది. 

2003లో బ్యాంకింగ్ లైనెన్సు

కోటక్ మహీంద్రా ఫైనాన్స్‌కు రిజర్వ్‌బ్యాంక్ నుంచి 2003లో బ్యాంకింగ్ లైసెన్సు లభించింది. దీనితో కంపెనీ పేరును కోటక్ మహీంద్రా బ్యాంక్‌గా మార్చా రు. ఈ బ్యాంక్‌లో ఇప్పట్లో ఉదయ్ కోటక్‌కు 56 శాతం వాటా ఉండగా, 5 శాతం వాటా ఆనంద్ మహీంద్రా చెంత ఉన్నది. దేశంలో బ్యాంక్‌గా అవతరించిన తొలి నాన్ బ్యాం కింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) ఇదే. 

ఐఎన్‌జీ వైశ్యాబ్యాంక్ టేకోవర్

కోటక్ మహీంద్రా బ్యాంక్ 2014లో రూ. 15,000 కోట్ల విలువతో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను టేకోవర్ చేసింది. దీనితో ఐఎన్‌జీ వైశ్యాబ్యాంక్ 2015లో కోటక్ బ్యాం క్‌తో విలీనమయ్యింది. 

రూ.7.68 లక్షల కోట్ల ఆస్తులు

కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,965 శాఖ లు ఉన్నాయి. 2024 మార్చి 31నాటికి ఈ  బ్యాంక్‌లో 1,16,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోటక్ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ. 7,67,667  కోట్లు. కోటక్ బ్యాంక్‌కు ప్రస్తు తం ఉదయ్ కోటక్ నాన్ డైరెక్టర్‌గా, అశోక్ వాస్వాని ఎండీ, సీఈవోగా  వ్యవహరిస్తున్నారు. 

రూ.3.47 లక్షల కోట్ల  మార్కెట్ విలువ

స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.3,46,648 కోట్లు.  ఆస్తుల్లోనే కాకుండా మార్కెట్ విలువలో సైతం ప్రైవేటు బ్యాంక్‌ల్లో నాల్గవస్థానంలో కోటక్ బ్యాంక్ నిలిచింది.

కోటక్‌తో కలసిన మహీంద్రా

ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీగా పునాది పడినదే ప్రస్తుత కోటక్ మహీంద్రా బ్యాంక్. 1985లో కోటక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో ఉదయ్ కోటక్ తన కుటుంబం, స్నేహితుల నుంచి రూ.30 లక్షల రుణం తీసుకుని ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీని ముంబైలో నెలకొల్పారు. అప్పట్లో ఇది బిల్ డిస్కౌంటింగ్, లీజ్, హైర్ పర్చేజ్ కార్యకలాపాల్ని నిర్వహించేది. 1886లో ఈ కంపెనీలో మహీంద్రా గ్రూప్ వారసుడైన ఆనంద్ మహీంద్రా, ఆయన తండ్రి హరీష్ మహీంద్రాలు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి చేశారు. దీనితో ఈ కంపెనీ పేరును కోటక్ మహీంద్రా ఫైనాన్స్‌గా మార్చా రు. తదుపరికాలంలో ఇది కార్ ఫైనాన్సింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీ సుల్ని ప్రారంభించడంతో పాటు విదేశాలకు విస్తరించింది.