calender_icon.png 22 September, 2024 | 11:08 AM

గరం గరంగా పీఏసీ తొలి సమావేశం

22-09-2024 12:43:25 AM

  1. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన, వాకౌట్
  2. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలి!
  3. సమావేశంలో మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్
  4. దుబారాను అరికట్టి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలి 
  5. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ
  6. హరీశ్‌రావు స్థానంలో గాంధీ పేరు ఎలా వచ్చింది 
  7. మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) తొలి సమావేశం గరంగరంగా జరిగింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) తొలి సమావేశం  పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన శాసనమండలి కమిటీ సమావేశ హాలులో శనివారం జరిగింది. సమావేశానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు, కమిటీ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, రామారావు పవార్, అహ్మద్‌బిన్ అబ్దుల్ బలాల, కూనంనేని సాంబశివరావు, టి.జీవన్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు, ఎల్.రమణ, సత్యవతి రాథోడ్  హాజరయ్యారు.

ప్రజాధనం దున్వినియోగం కాకుండా చూడాలని, అయా అంశాలనుచర్చించేందుకు అవసరమైతే సబ్ కమిటీలు వేసుకునే అవకాశం ఉందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలిపారు. పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడు తూ తనను పీఏసీ చైర్మన్‌గా నియమించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా సమిష్టిగా కృషి చేయాలన్నారు.  

అవసరమైతే సబ్ కమిటీలు..

అప్రాప్రియేషన్ అకౌంట్స్, ఆడిట్ రిపోర్టులను పరిశీలించే విషయంలో కమిటీకి అకౌంటెట్ జనరల్ సలహాలు, సూచనలు అందిస్తారని మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయా అంశాలపై క్షుణ్నంగా చర్చించేందుకు అవసరమైతే సబ్ కమిటీలను ఏర్పాటుచేసుకనే అవకాశం పీఏసీకి ఉందని తెలిపారు. కమిటీ ఛైర్మన్, సభ్యులకు సముచిత ప్రాముఖ్యత ఉంటుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

దుర్వినియోగం కాకుండా చూడాలి..

అన్ని కమిటీల మాదిరిగా కాకుండా పీఏ సీ బాధ్యతలు భిన్నంగా ఉంటాయని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వానికి అవసరమైన సలహా లు, సూచనలు ఇస్తూ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని స్పీకర్ కోరారు. 

సూక్ష్మ శాసన వ్యవస్థ

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడు తూ ఉభయ సభలు సంవత్సరమంతా సమావేశాలు నిర్వహించలేవని, శాసనసభ కమిటీలు క్రియాశీలకంగా ఉంటాయని, అందుకే ప్రజాస్వామ్యంలో కమిటీ వ్యవస్థను సూక్ష్మ శాసన వ్యవస్థగా అభివర్ణిస్తారని పేర్కొన్నారు. శాసనసభ నియమావళి ప్రకారమే ప్రతిపక్ష సభ్యుడిని పీఏసీ ఛైర్మన్‌గా నియమించామని అన్నారు.  బడ్జెట్‌ను  తని ఖీ చేసే అధికారం  పీఏసీ కమిటీకి మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. 

బీఆర్‌ఎస్ సభ్యుల వాకౌట్

పీఏసీ మొదటి సమావేశంలోనే బీఆర్‌ఎస్ సభ్యుల నుంచి నిరసన ఎదుర య్యింది. పీఏసీ చైర్మన్ పదవికోసం ఎన్ని నామినేషన్లు వచ్చాయని ప్రశ్నించారు. అయితే అది స్పీకర్ విచక్షణాధికా రం అంటూ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పా రు. దీంతో గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించడంపై నిరసన తెలుపుతూ బీఆర్‌ఎస్ సభ్యులైన ఎమ్మెల్యేలు  సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ పీఏ సీ చైర్మన్ కోసం ఎమ్మెల్యే హరీశ్‌రావు వేసిన నామినేషన్ ఏమయ్యిందని, గాంధీ నామినేషన్ ఎలా వచ్చిందంటూ  ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ ఒక్కమాటకూడా మాట్లాడటం లేదని, అన్నింటికీ మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం ఇస్తున్నారని అంటూ నిరసన తెలిపి వాకౌట్ చేశామని తెలిపారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ పీఏసీ చైర్మన్ నియామకంపై సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం చాలా బాధాకరమని అన్నారు.

పీఏసీపై బీఆర్‌ఎస్ కుట్ర

పీఏసీ ఔన్నత్యం తగ్గించేందుకు బీఆర్‌ఎస్ సభ్యులు కుట్ర చేస్తున్నారని, గత పదేండ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసం బ యటకు రాకుండా చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ నియామకం వివాదంపై పలువురు ఎమ్మెల్యేలు శనివారం   సీఎల్పీ కార్యాలయంలో మీ డియాతో మాట్లాడారు.  పీఏసీ చైర్మన్ పదవి నిబంధనల ప్రకారమే చైర్మన్  జరిగిందన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మా ట్లాడుతూ 2018లో  భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడు తూ... హరీశ్ రావు అంటే అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు.