దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న “పోలీస్ వారి హెచ్చరిక” చిత్రం ఫస్ట్ లుక్‌ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “టైటిల్ ఎంత ఆకర్షణీయంగా ఉందో ఫస్ట్ లుక్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉందని, ఎవరినైనా తాళ్ళతోనో, సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారని, కానీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒక పోలీస్‌ను తుపాకులతో కట్టి బంధించడం నిజంగా కొత్తగా ఉందని, ఎప్పుడూ కొత్త కథలతో, కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని” అన్నారు.
“సినీ పరిశ్రమలో నేను అన్నయ్య అని పిలిచేది హీరో శ్రీకాంత్ గారిని మాత్రమేనని దర్శకుడు బాబ్జీ అన్నారు. నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ “ఎప్పటికైనా హీరో శ్రీకాంత్ గారితో ఒక ఫోటో దిగాలనుకున్నాను , అటువంటిది యీ రోజు నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నే ఆయన ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం” అన్నారు. కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.