24-03-2025 12:15:42 AM
సాయిదుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సంబరాల యేటిగట్టు’. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రోహిత్ కేపీ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సాయిదుర్గాతేజ్ మునుపెన్నడూ కనిపించని అవతార్‌లో అలరించనున్నట్టు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన కార్నేజ్ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది.
ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సీనియర్ నటుడు శ్రీకాంత్ పుట్టిన రోజు కావటంతో ఆదివారం ఆయన ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీకాంత్‌ను బ్రిటిషు పాత్రలో పరిచయం చేశారు. పోస్టర్‌లో శ్రీకాంత్ రగ్గడ్ హెయిర్, గడ్డంతో బ్లాక్ కోట్ ధరించి ఫెరోషియస్‌గా కనిపిస్తున్నారు. ఇదే ఏడాది సెప్టెంబర్ 25న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతోందీ సినిమా. ఈ చిత్రానికి డీవోపీ: వెట్రి పళనిసామి; సంగీతం: బీ అజనీష్ లోక్‌నాథ్; ఎడిటర్: నవీన్ విజయకృష్ణ.