17-02-2025 12:25:41 AM
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మహిళ మృతి
అమరావతి, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్‌లో తొలి గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) మరణం నమోదైంది. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ (౪౫) గుంటూరు జీజీహెచ్‌లో జీబీఎస్ కోసం చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.
ఈ విషయాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి ధ్రువీకరించారు. నరాల సంబంధిత జీబీఎస్ కేసులు ఏపీలో ఇటీవల ఒక్కసారిగా పెరిగాయి. ఈ నెల 11న ఒక్కరోజే గుంటూరు జీజీహెచ్‌కు ఏడు కేసులు వచ్చాయి.