calender_icon.png 24 October, 2024 | 2:11 AM

మలయాళంలో మొదటి చిత్రం

12-07-2024 12:05:00 AM

తమిళ చిత్రాలతో దర్శకుడిగా పేరొందిన గౌతమ్ మీనన్ పుట్టింది మాత్రం కేరళలో. ఆయన తండ్రి మలయాళీ కాగా తల్లి తమిళనాడుకు చెందిన వారు. ఆ రకంగా రెండు రాష్ట్రాలతోనూ ఆయకు సంబంధాలున్నాయి. నటుడిగా పలు మలయాళ చిత్రాల్లో కనపడిన గౌతమ్ మీనన్, తాను దర్శకుడిగా మారిన సుమారు ఇరవై రెండేళ్ల తర్వాత ఓ మలయాళీ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అక్కడి అగ్ర కథానాయకుడైన మమ్ముట్టితో తన తొలి మలయాళీ చిత్రాన్ని చేయనున్నారాయన. మమ్ముట్టి స్వీయ నిర్మాణ సంస్థలో రూపొందనున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. లెనా, గోకుల్ సురేశ్, విజి వెంకటేష్ తదితరులు నటించనున్న ఈ సినిమాలో సమంత ముఖ్య పాత్ర పోషిస్తున్నారట. దర్బుక శివ సంగీతం అందించనున్న ఈ సినిమాకి విష్ణుదేవ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.